Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మ చెప్పినా వినలేదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నా!: ఆమని

  • సినిమాలు చేయవద్దని నా భర్త చెప్పారు
  • అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా
  • పరిశ్రమకు వచ్చిన తొలి రెండేళ్లు నిరాశగా గడచిపోయాయి
ఆమని... స్టార్ హీరోలందరి సరసన నటించి, ప్రేక్షకులను మెప్పించిన నటి. హీరోయిన్ గా టాప్ రేంజ్ లో ఉన్నప్పుడే, పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయింది. తమిళ సినీ నిర్మాతను పెళ్లి చేసుకుని, జీవితంలో సెటిల్ అయింది. తాజాగా 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా నటించింది.

తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆమని పంచుకుంది. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన తనకు... ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం కొంచెం ఇబ్బందిగానే ఉందని తెలిపింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రాధాన్యత ఒక 20 శాతం తగ్గిందనిపిస్తోందని చెప్పింది. హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉన్నావు, మళ్లీ ఇంత మంచి కెరీర్ రాదని అమ్మ చెప్పినా... వినకుండా పెళ్లి చేసుకున్నానని చెప్పింది. సినిమాల్లో నటించవద్దని తన భర్త కండిషన్ పెట్టారని... అందుకే సినిమాలకు దూరమయ్యానని, ఇప్పుడు అలాంటి షరతులు లేవని తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రెండేళ్లు ఎంతో నిరాశగా గడిచిపోయాయని... తన ఫొటో చూసి ఓకే చెప్పినవాళ్లు, తీరా తనను డైరెక్ట్ గా చూడగానే తిరస్కరించేవారని చెప్పింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు వచ్చాయని తెలిపింది. 
amani
actress
tollywood

More Telugu News